Tuesday, September 1, 2020

అనంత పద్మనాభ వ్రతం

 



అనంత పద్మనాభ వ్రతం - 01-సెప్టెంబర్-2020 ౹ మంగళవారం


భాద్రపద శుక్ల చతుర్దశినాడు జరుపుకొనే వ్రతం అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం. కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడటానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించటం తరతరాలుగా వస్తోంది.


ఎంతో పూర్వ కాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావనిలో కనిపిస్తుండటం విశేషం. పాండవులు వనవాసం సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అనంతపద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్లచతుర్దశినాడు చేయమని చెప్పాడట. అనంతుడన్నా, అనంతపద్మనాభస్వామి అన్నా సాక్షాత్తూ కాలమే అన్నాడు. యుగ, సంవత్సర, మాస తదితర కాలం అంతా తన స్వరూపమన్నాడు. అనంతపద్మనాభుడంటే కాల స్వరూపుడైన వైకుంఠవాసుడి అవతారమే శ్రీకృష్ణుడు. పాల కడలిలో శేషశయ్య మీద పవళించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య స్వరూపమే అనంతపద్మనాభుడు. ఈ వ్రతమహిమతో కృతయుగంలో సుశీల-కౌండిన్య దంపతుల సకల సంపదలు, సుఖసంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి


నమో నమస్తే వైకుంఠ శ్రీవత్స శుభలాంఛనా ౹

త్వన్నమస్మరణాత్ పాపమశేషం నః ప్రణశ్యతి ౹౹

నమో నమస్తే గోవిందా నారాయణ జనార్దనా ౹౹౹


సిద్ధాంతి గారు ద్వారా విలువైన సందేశాలను తెలుసుకొని అచరించడానికై #SIDDHANTHE  యూట్యూబ్ ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేయగలరు.


సబ్స్క్రిప్షన్ లింక్ : 👇

https://www.youtube.com/channel/UCXLTOpa0cqFak9XPetxExow?sub_confirmation=1

పంచాంగం - 1st September 2020 - Tuesday | పంచాంగం ప్రతి నిత్యం తెలుసుకోవడం వలన కలిగే అద్భుత ఫలితాలు ..?